వెంకన్న ఆలయంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు

వెంకన్న ఆలయంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు

WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని 61వ డివిజన్ చైతన్యపురి కాలనీలో వారం రోజులుగా సాగుతున్న గోదాదేవి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు రఘు రామాచార్యులు ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలను వితరణ చేసి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం పూర్ణాహుతితో వేడుకలు ముగిసినట్లుగా ప్రకటించారు.