పేకాట స్థావరంపై దాడి.. నగదు స్వాధీనం
PDPL: ధర్మారంలో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన 7 గురు వ్యక్తులను పట్టుకుని రూ. 3,050 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.