రైతుల ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్: హరీశ్ రావు

రైతుల ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్: హరీశ్ రావు

SDPT: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటోందని మాజీ మంత్రి,ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు బడా కాంట్రాక్టర్ల కోసమే పనిచేస్తున్నారని 'X' వేదికగా విమర్శించారు. రైతుల కన్నీళ్లతో పాలన సాగించిన ఏ ప్రభుత్వం బాగుపడలేదని హితవు పలికారు.అన్నదాతలు ఇబ్బందుల్లో ఉన్నారని వెంటనే రైతుబంధు విడుదల చేయాలన్నారు