కొత్త బురుజుకు 30 టాయిలెట్ల మంజూరు: కలెక్టర్
NDL: డోన్ మండల పరిధిలోని కొత్త బురుజు గ్రామ అభివృద్ధిలో భాగంగా మహిళలకు 30 టాయిలెట్లు మంజూరు చేసినట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు. గురువారం ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డితో పాటు కలెక్టర్ తాగునీటి పైప్‌లైన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. టాయిలెట్లు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని మహిళలు తెలపడంతో కలెక్టర్ స్పందించి వెంటనే నిర్మిస్తామన్నారు.