'ప్రధానమంత్రి మాతృ యోజన యాప్ రద్దు చేయండి'
NLR: ప్రధానమంత్రి మాతృ యోజన యాప్‌ను రద్దు చేయాలని అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్, నెల్లూరు అర్బన్ ప్రాజెక్ట్ గౌరవాధ్యక్షుడు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. నిన్న నెల్లూరు అర్బన్ సీడీపీవో అరుణను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యాప్స్ కారణంగా అంగన్వాడీలపై పని భారం పెరిగిందని అన్నారు.