తుఫాన్ నేపథ‍్యంలో ప్రత్యేక అధికారుల నియామకం
VSP: తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించింది. విశాఖ జిల్లాకు ప్రత్యేక అధికారిగా అజయ్‌జైన్‌ను నియమించింది. అలాగే, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల బాధ్యతను వాడ్రేవు వినయ్ చంద్‌కు అప్పగించింది.