మెడికల్ కళాశాలలు ప్రైవేటు కరణపై సంతకాల సేకరణ
VZM: మెడికల్ కళాశాలలు ప్రైవేటుకరణకు వ్యతిరేకంగా కొత్తవలస మండలం ఉన్న పలు గ్రామాల్లో కోటి సంతకాల సేకరణ గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు ప్రారంభించిందని తెలిపారు.