VIDEO: ఫిరంగిపురం ప్రధాన రహదారిపై దట్టమైన పొగమంచు
GNTR: సోమవారం తెల్లవారుజాము నుంచి ఫిరంగిపురం–కర్నూలు– గుంటూరు ప్రధాన రహదారి ప్రాంతం అంతా దట్టమైన పొగమంచు కమ్మేసింది. పొగ మంచు కారణంగా వాహనదారులు నిదానంగా, హెడ్‌లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వచ్చింది. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. అప్రమత్తంగా వాహనాలు నడపాలని సూచించారు.