390 క్షిపణులతో ఇరాన్ దాడి చేసింది: అమెరికా
పశ్చిమాసియాలోని తమ స్థావరాలపై 390 క్షిపణులు.. 830 డ్రోన్లతో ఇరాన్ దాడి చేసినట్లు అమెరికా ప్రకటించింది. అలాగే యూఏఈపై 541 డ్రోన్లు, 165 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని తెలిపింది. వీటిల్లో 506 డ్రోన్లు, 152 క్షిపణులను కూల్చేసినట్లు వెల్లడించింది. మరోవైపు కువైట్‌పై 97 బాలిస్టిక్ క్షిపణులు, 283 డ్రోన్లు ప్రయోగించగా.. ఒకరు మృతి చెందారని, 30 మంది గాయపడ్డారని చెప్పింది.