'ఎయిర్ పోర్ట్ వరకు బస్సును పొడిగించాలి'

'ఎయిర్ పోర్ట్ వరకు బస్సును పొడిగించాలి'

ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వరకు నడిచే బస్సును శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు పొడిగించాలని జన్నారం గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి నాయకులు కోరారు. శుక్రవారం ఉట్నూర్ డిపో అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఆదిలాబాద్ డిపో నుండి ఉట్నూర్, జన్నారం మీదుగా హైదరాబాద్‌కు బస్సును నడుపుతున్నారని తెలిపారు. గల్ఫ్ కార్మికులకు మేలు చేసే విధంగా బస్సును పొడిగించాలన్నారు.