'మంత్రిని తక్షణమే అరెస్టు చేయాలి'

నంద్యాల: బేతంచెర్లలో స్వతంత్ర అభ్యర్థి బాబుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన అనుచరులతో దాడి చేయించడం సిగ్గుచేటని కూటమి MLA అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు. డోన్ పట్టణంలోని TDP కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, మంత్రిపై కేసు నమోదు అయిందని, తక్షణమే బుగ్గనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.