NMMS యాప్‌తో కూలీల ఇబ్బందులు
ADB: ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు ఎన్ఎంఎంఎస్ (NMMS) యాప్ శాపంగా మారింది. రోజుకు రెండుసార్లు ఫొటోలతో కూడిన హాజరు నమోదు చేయాల్సి ఉండగా, నెట్వర్క్ సమస్యలు, సాంకేతిక లోపాలతో హాజరు పడటం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల వేతనాలు కోల్పోయే ప్రమాదం ఉందని, ప్రభుత్వం స్పందించి సులభమైన ప్రత్యామ్నాయం చూపాలన్నారు.