పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: ఎంపీ
SRD: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని మెదక్ ఎంపీ సభ్యులు రఘునందన్ రావు అన్నారు. కందిలోని ఎల్ ఎన్ గార్డెన్‌లో వాసవి క్లబ్ గవర్నర్ వీడ్కోలు సమావేశం ఇవాళ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వాసవి క్లబ్ ద్వారా అన్ని వర్గాలకు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి పాల్గొన్నారు.