కలెక్టర్ నేతృత్వంలో పంట మార్కెటింగ్ సమీక్ష

కలెక్టర్ నేతృత్వంలో పంట మార్కెటింగ్ సమీక్ష

కర్నూలు: కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి వివిధ పంటల మార్కెటింగ్‌పై ట్రేడర్లతో సమీక్ష నిర్వహించారు. రైతులకు న్యాయమైన ధర లభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, వ్యవసాయ అధికారులతో పాటు అనుబంధ శాఖల అధికారులు ఉన్నారు.