నల్లబెల్లిలో BRSకు బిగ్ షాక్
WGL: నల్లబెల్లి(M)లోని నందిగామ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు MLA మాట్లాడుతూ.. ప్రజా పాలనలో పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి దశలవారీగా సంక్షేమ పథకాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చరణ్ సింగ్ పాల్గొన్నారు.