తప్పిపోయిన బాలుడు.. తల్లిదండ్రుల చెంతకు
KDP: ప్రొద్దుటూరు వన్‌టౌన్ పరిధిలో తప్పిపోయిన 15 ఏళ్ల బాలుడు నారాయణ సత్య జితేంద్రనాథ్‌ను పోలీసులు సురక్షితంగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇంట్లో మందలించడంతో ఈనెల 9న పారిపోయిన బాలుడిని కర్ణాటక రాష్ట్రం రాయచూరులో ఏఎస్సై జాషువా, కానిస్టేబుల్ నరసింహనాయుడు గుర్తించారు. బాలుడిని సురక్షితంగా తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.