నీతి ఆయోగ్ రిపోర్ట్.. కడప జిల్లాకు లభించిన ర్యాంకులు.!

నీతి ఆయోగ్ రిపోర్ట్.. కడప జిల్లాకు లభించిన ర్యాంకులు.!

KDP: నీతి అయోగ్ రిపోర్టు ఆధారంగా కడప జిల్లాకు వచ్చిన ర్యాంకులను కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు ఆరోగ్య సంరక్షణలో 35వ ర్యాంక్, విద్యలో 100, వ్యవసాయంలో 24, ఆర్థికాభివృద్ధిలో 71, మౌలిక సదుపాయాల్లో 34వ ర్యాంక్ సాధించామని ఆయన పేర్కొన్నారు. కాగా, వీటి ఆధారంగా వైద్య ఆరోగ్య శాఖ, ఐసీడీఎస్, డీఆర్డీఏ అధికారులు కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ తెలిపారు.