నూరు శాతం ఇంటి పన్నులు వసూళ్లు చేయాలి: MPDO
BPT: కర్లపాలెం మండలం ఎట్రావారిపాలెం పంచాయతీలో జరుగుతున్న ఇంటి పన్నుల వసూళ్ల కార్యక్రమాన్ని శుక్రవారం ఎంపీడీఓ శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఇంటి పన్నులు నూరుశాతం వసూలు చేయాలని సూచించారు. షాపులకు సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ పన్నులు కూడా స్వర్ణ పంచాయతీ యాప్ ద్వారా చెల్లించేలా సచివాలయ సిబ్బంది చర్యలు తీసుకోవాలని అన్నారు.