మేయర్ వసీంకు దక్షిణ కొరియా సదస్సు ఆహ్వానం
ATP: వరల్డ్ హ్యూమనిస్టిక్ సిటీస్ నెట్‌వర్క్ ఆధ్వర్యంలో దక్షిణ కొరియాలో ఓ సదస్సు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నగర మేయర్ వసీంకు ఆహ్వానం అందగా.. ఆయన కొరియాకు వెళ్లారు. సాంకేతికతకు అనుగుణంగా నగరాల అభివృద్ధి, మానవతా విలువల పెంపుపై నేడు జరిగే ఈ సదస్సులో మేయర్ ఒక సెషన్‌కు అధ్యక్షత వహించనున్నట్లు సమాచారం.