గాంధీజీ సిద్ధాంతాలను ప్రతి ఒక్కరు ఆచరించాలి: బల్దియా కమిషనర్

WGL: మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని బుధవారం మహానగర పాలక సంస్థ కార్యాలయంలోని గాంధీ విగ్రహానికి మహా నగరపాలక సంస్థ కమీషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాఖేడే పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. గాంధీజీ సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బల్దియా అధికారులు, మున్సిపల్ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.