రామచంద్రాపురంలో హీరో రామ్ సందడి

రామచంద్రాపురంలో హీరో రామ్ సందడి

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో హీరో రామ్ సందడి చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్‌ను మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి ప్రారంభించారు. బీహెచ్ ఈఎల్ సర్కిల్లో ఏర్పాటు చేసిన మాల్ను రాజనర్సింహ ప్రారంభించగా.. హీరో రామ్, సినీ రచయిత తనికెళ్ల భరణి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా రామ్ ఫ్యాన్స్ భారీగా రావడంతో సందడి నెలకొంది.