టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు

నెల్లూరు రూరల్ నియోజకవర్గం 24వ డివిజన్‌కు చెందిన వైసీపీ పార్టీ నాయకులు మాల్యాద్రి రెడ్డి, మాలకొండారెడ్డి, భాస్కర్‌లు వైసీపీకి రాజీనామా చేసి బుధవారం టీడీపీలో చేరారు. నెల్లూరు నగరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి సోదరులు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.