అగ్నిప్రమాదం.. మంటలు అదుపు చేసిన ఫైర్ సిబ్బంది

అగ్నిప్రమాదం.. మంటలు అదుపు చేసిన ఫైర్ సిబ్బంది

CTR: పుంగనూరు పట్టణ పరిధిలోని భగత్ సింగ్ కాలనీ నాలుగు రోడ్ల కూడలి సమీపంలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సుధాకర్ రెడ్డికి చెందిన వ్యవసాయ పొలాల వద్ద నీలగిరి తోటలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. స్థానికులు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. సిబ్బంది అక్కడికి చేరుకొని, పక్కనున్న షాపులకు మంటలు వ్యాపించకుండా అదుపు చేసినట్లు ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు తెలిపారు.