కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్
NZB: మాక్లూర్ మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ కలిసి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ పరిశీలించారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వలు, రైతులకు కల్పించిన సదుపాయాల గురించి కేంద్రాల నిర్వాహకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.