బీజేపీ నేతల నిరసనకు కారణమిదే!

బీజేపీ నేతల నిరసనకు కారణమిదే!

TG: సచివాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. 'సేవ్ హైదరాబాద్' పేరుతో సచివాలయాన్ని ముట్టడించడానికి గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ నేతలు యత్నించారు. కరెంట్ తీగలతో మరణాలు, GHMCలో డ్రైనేజీ సమస్యలు, గుంతల రోడ్లపై బీజేపీ నేతలు, కార్యకర్తలు నిరసన తెలిపారు. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సచివాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.