అమానుషం.. తల్లిని ఇంట్లో నుంచి గెంటేసిన కూతురు
GNTR: ఆస్తి కోసం కన్న కూతురే తల్లిని ఇంట్లో నుంచి గెంటేసిన అమానుష ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. మంగళగిరి మండలం, నిడమర్రు గ్రామంలో ఓ వృద్ధ తల్లిని తన చిన్న కూతురు, అల్లుడు ఆస్తి రాయించుకున్న అనంతరం ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు. దీంతో బాధితురాలు పీఎస్‌ను ఆశ్రయించింది. ఇంటిని ఫోర్జరీ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు ఆమె ఆరోపించింది. పోలీసులు విచారణ చేపట్టారు.