తాళం వేసిన ఇంట్లో దొంగతనం.. నగదు చోరీ

తాళం వేసిన ఇంట్లో దొంగతనం.. నగదు చోరీ

NDL: పాణ్యం మండల కేంద్రంలోని విజయానికేతన్ పాఠశాల సమీపంలోని శుక్రవారం ఒక ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. హోటల్ వంట మాస్టర్‌గా పని చేస్తున్న జక్కుల మద్దిలేటి, డొంగు భార్యాభర్తలు. హోటల్‌కు వెళ్ళిన సమయంలో దొంగలు ఇంట్లోకి ప్రవేశించి మూడు బీరువాలను పగులగొట్టి రూ.60 వేలు నగదు, ఒక బంగారు ఉంగరాన్ని చోరీ చేశారు.