ఎయిర్‌పోర్ట్ రన్‌వేపై ఆగిన విమానం
TG: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రన్‌వే పై వెళ్తున్న రాయపూర్ విమానం ఆగిపోయింది. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు అప్రమత్తమై ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కావాల్సిన 2 విమానాలను కొంతసేపు గాలిలో చక్కర్లు కొట్టించారు. టేక్ ఆఫ్ కావాల్సిన మరో 3 విమానాలు ఆలస్యమయ్యాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.