ట్రాక్టర్ నడిపిన ఏసీపీ
PDPL: గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ముత్తారం మండలంలో ప్రజలతో గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ సమావేశం నిర్వహించారు. అనంతరం పోలింగ్ బూత్‌లలో ఏర్పాట్లను పరిశీలించారు. తదనంతరం మండలంలోని మారుమూల ప్రాంతమైన శాత్రాజుపల్లికి స్వయంగా మానేరులో ట్రాక్టర్ నడుపుతూ వెళ్లి అక్కడి ప్రజలకు ఎన్నికలపై అవగాహన కల్పించారు. ఏసీపీ వెంట ముత్తారం ఎస్సై ఎన్.రవికుమార్ ఉన్నారు.