సహజీవనం చేస్తున్న జంట ఆత్మహత్య

సహజీవనం చేస్తున్న జంట ఆత్మహత్య

KRNL: ప్రొద్దుటూరు లింగాపురంలో శనివారం ఓ జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను జిల్లాకు చెందిన ప్రమీల, రంగస్వామిగా పోలీసులు గుర్తించారు. కొంతకాలంగా వీరు ఇరువురు సహజీవనం చేస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రమీల మృతితో ఆమె ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.