నీటి కుంటలో మృతదేహం లభ్యం

నీటి కుంటలో మృతదేహం లభ్యం

KMR: బీర్కూరు మండలం అన్నారం గ్రామానికి చెందిన నీరడి సాయిబాబా (35) నీటి కుంటలో మునిగి మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం గేదెలను గ్రామ శివారులోని సామర్లకుంటలో శుభ్రం చేసేందుకు కుంటలో దిగారు. ప్రమాదవశాత్తు కుంటలో మునిగి గల్లంతయ్యాడు. శనివారం ఉదయం అతని మృతదేహం లభ్యమయింది. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.