'రైతులకు యూరియా నిరంతరం పంపిణీ చేస్తాం'

'రైతులకు యూరియా నిరంతరం పంపిణీ చేస్తాం'

WNP: రైతులకు యూరియా నిరంతరం పంపిణీ చేస్తామని ఆత్మకూరు మండల వ్యవసాయ అధికారి వినయ్ కుమార్ గురువారం తెలిపారు. ఆగస్టు నెలలో రైతులకు 23 టన్నుల యూరియా ఆత్మకూరు పీఏసీఎస్ పంపిణీ చేయడం జరిగిందని, రైతులు అవసరం ఉన్నవారు మాత్రమే తీసుకువెళ్లాలని సూచించారు. యూరియా వచ్చిన వెంబడే పద్ధతి ప్రకారం రైతులకు అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.