ప్రారంభం కానున్న జగన్నాథుని రథయాత్ర

SKLM: జిల్లా వ్యాప్తంగా జగన్నాథ స్వామి రథయాత్ర శుక్రవారం నుంచి వైభవంగా ప్రారంభం కానుంది. శ్రీకాకుళం, ఇచ్చాపురం, జలుమూరు, సోంపేట తదితర మండలాల్లో జగన్నాథ, సుభద్ర, బలబద్రలను రథంపై ఊరేగిస్తారు. సుమారు పది రోజులపాటు స్వామి వారు వివిధ అవతారాలలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే ఆలయ నిర్వహకులు, సిబ్బంది పూర్తి చేశారు.