ఆదాయం కోట్లలో.. సౌకర్యాలు అంతంతే
NLG: కట్టంగూరు కేంద్రంలోని వారసంతకు ఏటా అరకోటి పైగా ఆదాయం సమకూరుతున్నా, ఇక్కడ కనీస సౌకర్యాలు కరువయ్యాయి. నిర్వహణ పేరుతో పన్నులు వసూలు చేస్తున్నా, మౌలిక సౌకర్యాల కల్పన అంతంత మాత్రంగానే ఉంది. సంతలో కనీసం మరుగుదొడ్లు మంచినీటి సదుపాయం లేకపోవడంతో వ్యాపారులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.