'మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'
MNCL: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 24 నుంచి జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి సంకే రవి తెలిపారు. శుక్రవారం మంచిర్యాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీ నిర్వాహకులు, కార్మికులకు రావలసిన కోడిగుడ్లు, వంట, టిఫిన్ బిల్లులు, వేతనాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.