పందిళ్ళపల్లిలో క్షయ వ్యాధిపై అవగాహన
KMM: చింతకాని మండలంలోని పందిళ్ళపల్లి గ్రామంలో శనివారం క్షయ వ్యాధి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ వత్సవాయి పద్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ అల్తాఫ్ మాట్లాడుతూ.. క్షయ వ్యాధి పట్ల భయం అవసరమని, క్రమం తప్పకుండా మందులు వాడితే ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని భరోసా ఇచ్చారు. వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలు ప్రజలకు వివరించారు.