VIDEO: వైసీపీ ర్యాలీలో నారాయణ కళాశాల విద్యార్థులు
KRNL: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కర్నూలులో నిరసన ర్యాలీ నిర్వహించింది. జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు ఎస్టీబీసీ కళాశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో నారాయణ కళాశాల విద్యార్థులు 200 మంది యూనిఫామ్లోనే పాల్గొన్నారు. వైసీపీ జెండాలు చేతబట్టి 'జై జగన్' అని నినాదాలు చేస్తూ ముందుకు సాగడం చర్చనీయాంశంగా మారింది.