లోక్‌సభ ముందుకు కీలక సవరణ బిల్లు
విదేశీ విరాళాలు అందుకుని లైసెన్స్ రద్దయిన సంస్థల ఆస్తులను నియంత్రించడానికి కేంద్రం విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి(FCRA) సవరణలు చేస్తూ బిల్లును దిగువసభలో ప్రవేశపెట్టింది. దీని ప్రకారం లైసెన్స్ రద్దయిన, దాన్ని వదులుకున్న లేదా లైసెన్స్‌ను పునరుద్ధరణ చేసుకోని NGOల ఆస్తుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటు కానుంది. అయితే ఈ బిల్లు ప్రమాదకరమని ప్రతిపక్షాలు ఆరోపించాయి.