గోనుగొప్పుల గ్రామానికి పబ్లిక్ స్కూల్ మంజూరు
NZB: భీమ్‌గల్ మండలం గోనుగొప్పుల గ్రామానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను మంజూరు చేయించినందుకు టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్‌ను సర్పంచ్ చేపూరు చరణ్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. శనివారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిశారు. గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు.