MTS ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలని వినతి

VZM: బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయనను ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయంలో MTS ఉపాధ్యాయులు ఉమాకామేశ్, శంకరరావు, అప్పలనాయుడు, ఎం.చంద్ర తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు MTS ఉపాధ్యాయులను సొంత మండలాల్లో నియమించి 62 ఏళ్లు సర్వీస్,12 నెలల వేతనం అమలు చేయాలన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేను కోరారు.