అంబేద్కర్ కృషి ఆదర్శనీయం: డీసీసీ అధ్యక్షుడు

అంబేద్కర్ కృషి ఆదర్శనీయం: డీసీసీ అధ్యక్షుడు

నల్గొండ పట్టణ బైపాస్ వద్ద డాక్టర్ బిఆర్.అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు మంగళవారం జరిగాయి. డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. సమానత్వం, సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన ఆశయాలు అందరికీ మార్గదర్శకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.