ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్

NRML: నిర్మల్ గ్రామీణ మండలంలోని రత్నాపూర్ కాండ్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను బుధవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంటి నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. దశలవారీగా పనులు పూర్తయిన వెంటనే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందన్నారు.