VIDEO: మాచేనమ్మను దర్శించుకున్న ఇస్రో శాస్త్రవేత్త

W.G: ఇస్రో శాస్త్రవేత్త పవన్ కుమార్ గురువారం తన కుటుంబంతో కలిసి ఆచంట మండలం, పెదమల్లంలోని మాచేనమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా గోదావరికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో అమ్మవారికి కుంకుమ పూజలు చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. అర్చకులు వారి కుటుంబాన్ని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.