పట్టుబడ్డ వైద్యురాలు జైషే మహిళా విభాగానికి హెడ్
ఢిల్లీ పేలుడు ఘటనకు సంబంధం ఉన్న లక్నోకు చెందిన మహిళా వైద్యురాలు సాహీనాను అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఆమెకు పాక్‌కు చెందిన జైషే సంస్థకు సంబంధం ఉన్నట్లు గుర్తించారు. భారత్‌లో జైషే మహమ్మద్ మహిళా విభాగానికి హెడ్‌గా సాహీనా వ్యవహరిస్తున్నట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం దర్యాప్తు బృందాలు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి.