జ్యూరిచ్ డైమండ్ లీగ్ ఫైనల్‌లో నీరజ్

స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో ఈనెల 27, 28 తేదీల్లో జరిగే డైమండ్ లీగ్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. సిలేసియా లీగ్‌లో పాల్గొననప్పటికీ, రెండు డైమండ్ లీగ్ సమావేశాల నుంచి 15 పాయింట్లతో తాజా స్టాండింగ్స్‌లో మూడో స్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. వాల్కాట్ (17), వెబర్ (15) తర్వాత చోప్రా 3వ స్థానంలో ఉన్నాడు.