శశిథరూర్ పోస్ట్‌పై బీజేపీ స్పందన
ప్రజస్వామ్యాన్ని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చేసిన పోస్ట్‌పై బీజేపీ స్పందించింది. ఈ వ్యాఖ్యలను పరోక్షంగా సొంత పార్టీ అయిన కాంగ్రెస్ వైఖరిని ఉద్దేశించి చేశారని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాల్ ఎద్దేవా చేశారు. గాంధీ కుటుంబం కోసం కాకుండా దేశం కోసం పని చేయాలని కాంగ్రెస్ నాయకులకు థరూర్ చురకలంటించారని వ్యాఖ్యానించారు.