VIDEO: రైల్వే ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన సీఎం

HYD: తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీ కడియం కావ్య, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ రైల్వే ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రాజెక్టుల పురోగతి, నిధులు, భూసేకరణ వంటి అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.