సమస్యలతో విద్యార్థుల ఇబ్బందులు

GDL: రాజోలి పట్టణ కేంద్రంలోని ఉర్దూ ఉన్నత పాఠశాలలో తరగతి గదులున్నా సమస్యలతో విద్యార్థులు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. తరగతి గదుల్లో, వరండాల్లో బండలు కుంగిపోయి నడవడానికి కూడా ఇబ్బందికరంగా మారాయి. గడిచిన విద్యా సంవత్సరమంతా అవస్థల మధ్య చదువుకున్నారు. ప్రస్తుతం సెలవుల్లోనైనా వాటిని బాగు చేసేలా చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.