నేవీ రాడార్ స్టేషన్ శంకుస్థాపనకు మంత్రికి ఆహ్వానం

VKB: పరిగి నియోజకవర్గంలోని దామగుండం గ్రామంలో ఈ నెల 15న నేవీ రాడార్ స్టేషన్‌కు శంకుస్థాపన చేయనున్నట్టు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను గురువారం మంత్రి నివాసంలో కలిసి ఆయన ఆహ్వాన పత్రిక అందించారు. రాడార్ స్టేషన్ నిర్మాణంతో భారత రక్షణ వ్యవస్థకు మరింత బలం చేకూరుతుందన్నారు.