భారత్ జెండా ఉన్న ట్యాంకర్లకు ఇరాన్ అనుమతి
భారత్ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్లుకు ఇరాన్ అనుమతి ఇచ్చింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో కేంద్రమంత్రి జైశంకర్ చర్చలు జరిపారు. దీంతో పుష్పక్, పరిమళ్ ట్యాంకర్లు హోర్ముజ్ జలసంధిని దాటాయి. ఆయిల్‌తో పాటు గ్యాస్, ఇతర నిత్యవసరాల రవాణా కూడా ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. దీంతో త్వరలో భారత్ కష్టాలు తీరే అవకాశం ఉంది.